Chandra Grahan 2023 : శాస్త్రాల్లో చెప్పినట్టుగా గ్రహణం సమయంలో మనం చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ 2023వ సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో మొదటి చంద్రగ్రహణం మే 5వ తేదీ శుక్రవారం నాడు సంభవిస్తుంది.
అయితే అదే రోజు బుద్ధ పౌర్ణమి కూడా కావడం విశేషం. గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి రోజున జన్మించాడు. బౌద్ధులు ఆ రోజునే బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. పౌర్ణమి రోజున బుద్ధున్ని భక్తిశ్రద్ధలతో పూజించి పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈసారి బుద్ధ పౌర్ణమి కి చంద్రగ్రహణం కూడా రావడం చాలా ప్రత్యేకతను ఏర్పరచుకుంది.
మే 5వ తేదీ రాత్రి 8:45 నిమిషాల నుండి రాత్రి 1:00 వరకు అంటే మొత్తం నాలుగు గంటల 15 నిమిషాల పాటు చంద్రుడు గ్రహణంలో ఉంటాడు. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణం ప్రభావం కొన్ని రాశుల మీద పడుతుందని అలాంటి రాశుల వాళ్లు ఆసక్తికరమైన వార్తలు వింటారని నిపుణులు చెప్తున్నారు.
మకర రాశి..
గ్రహణ ప్రభావం మకర రాశి వారికి బాగానే కనిపిస్తుంది. వారు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఆ సమయంలో మొదలు పెట్టుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులలో కూడా వారికి బలం చేకూరుతుంది.
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారు కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశాలు గ్రహణ సమయంలో ఉన్నాయి. వీరు వాళ్ళ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడుపుతారు.
ధనుస్సు రాశి..
ధనస్సు రాశి వారికి కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలతో పాటు వారు ఊహించని విధంగా అనుకోని శుభవార్తలు అందుతాయి.
సింహ రాశి..
ఈ రాశి వారు వ్యాపారంలో మంచి లాభం గడిస్తూనే ఖర్చు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీరు అనుకోని ప్రయాణాలు చేస్తారు.
మిథున రాశి..
గ్రహ సమయంలో మిథున రాశి వారికి ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. వీరు ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి చేసుకోవచ్చు. కొత్త వ్యాపారాలైన ప్రారంభించుకోవచ్చు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో వీరు ఏ పని అయినా కూడా భయం లేకుండా మొదలుపెడతారు.