Allu Arjun : టాలీవుడ్ లో హీరోలు గతం నుంచి ప్రస్తుత తరం హీరోల వరకు అందరూ రాముడు మంచి బాలుడిలాగానే ఉంటూ వస్తున్నారు. అందుకే టాలీవుడ్ కి అంతర్జాతీయంగా కూడా అంత గుర్తింపు గౌరవం దక్కుతుంది. ఎంత పెద్ద హీరో అయిన సాధ్యమైనంత వరకు ఒదిగి ఉండడం మనవాళ్ళకి అలవాటు. వాళ్లలో అల్లు వారబ్బాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందువరసలో ఉంటాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. అది ఏంటంటే.. ఒక 8 సంవత్సరాల క్రితం విదేశాల్లో భర్తతో స్ధిర పడిన ఒక మహిళ చాలా సంవత్సరాల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చింది. తర్వాత ఆమె తన భర్త సంవత్సరం వయసున్న తన బాబుతో ఐమాక్స్ లో సినిమాకి వెళ్లిందట.
థియేటర్ లో బాబు ఏడుస్తుంటే బయటకి తీసుకు వచ్చి చూస్తే, బాబుకు డైపర్ మార్చాల్సిన అవసరం వచ్చింది అంట. అయితే ఆమె వస్తువులు అన్ని లోపల భర్త వద్ద ఉండిపోవడంతో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఫోన్ అడిగి భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పిందట. ఆ భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ వ్యక్తి బాబు తీసుకుని సముదాయిస్తూ మళ్ళీ ఫోన్ చేయమని ఆమెకి చెప్పడంతో ఆ భర్త ఫోన్ మాట్లాడి బయటకి వచ్చాడు.
వాళ్ళ పని పూర్తి అవగానే అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి ని చూపించి అతనే మొబైల్ ఇచ్చిందని భర్తకి చెప్పడంతో ఆ వ్యక్తి ని చూసి ఆమె భర్త షాక్ అయ్యాడట. అతను హీరో అల్లు అర్జున్ అని చెప్పడంతో ఆమె కూడా అక్కడున్న సెక్యురిటి గార్డ్స్ ని, ఆ వ్యక్తిని పరిశీలనగా చూసి తాను అల్లు అర్జున్ అని నిర్ధారణకి వచ్చిందట. ఒక హీరో అయ్యి ఉండి ఆమె తనని గుర్తు పట్టకపోయిన,
ఆమె ఇబ్బందిని గుర్తించి తన సొంత నంబర్ తో ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వడంతో పాటు, ఆ బాబుని సముదాయించడం ఆ దంపతుల్ని ఆశ్చర్యానికి గురి చేసిందట. ఈ విషయాన్ని ఆమె Quora లో షేర్ చేయగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో మా బన్నీ మనసున్న మారాజు అనుకుంటున్నారు అల్లు ఆర్మీ సైనికులు.
https://te.quora.com/%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A1%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%9F%E0%B1%81-%E0%B0%8E%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D/answers/197855921?ch=10&oid=197855921&share=c3e050dd&srid=uy4Z9K&target_type=answer