Allu Arjun : మన స్టార్ హీరోలకి సంబంధించి ఫేక్ లుక్స్ ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. సినీ రంగంలో పలువురు ఫేమస్ సెలెబ్రెటీలకి సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్ అలానే స్ప్రెడ్ అవుతువస్తున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ చేస్తున్న టైంలో ఓ లుక్ మార్ఫ్ చేశారు నార్త్ ఆడియన్స్. అది మార్ఫింగ్ అని ఫాన్స్ గగ్గోలు పెట్టారు. ఆ మధ్య హీరోయిన్స్ విషయంలో మాత్రమే మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చేసేవారు.
కానీ ట్రెండ్ మారింది ఇలాంటి పిక్స్ క్రియేట్ చేసి ఫన్ జనరేట్ చేస్తున్నాం అనే పేరుతో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ బ్రెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన అల్లు అర్జున్ కి కూడా ఇదే జరుగుతుంది. అల్లు అర్జున్ ది లేటెస్ట్ గా గడ్డం లేకుండా ఓ పిక్ వైరల్ అవుతుంది. అయితే ఇది మార్ఫ్ పిక్ ఇప్పుడు నార్త్ లో ఆడియెన్స్ కూడా ఇది వైరల్ చేస్తున్నారు. ఇది ఒక హీరో కోసం ఇంకో హీరోని తగ్గించే ప్రయత్నం అనుకోవాలో.. ఆకతాయిల చేతిలో పని అనుకోవాలో అర్థం కావడం లేదు.