Bandla Ganesh on Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు దేవర అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ మూవీ టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసారు మేకర్స్. సముద్రపు అలలు ఎగసి పడుతుండగా రాళ్ళ గుట్టలపై నిలుచుని చేతిలో బల్లెంతో చుట్టూ తాను తెగనరికిన దుర్మార్గుల శవాలతో జూనియర్ గెటప్ చాలా ఇంటెన్స్ గా ఉంది. రొటీన్ మాస్ టైపులో కాకుండా నల్లని చొక్కా పంచెతో దర్శనం ఇవ్వడం ఎవరూ ఊహించనిది.
కళ్ళలో సముద్రమంత ఆవేశాన్ని నింపుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్న చూపు ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక లుక్ కి తగ్గట్లుగానే దేవరా టైటిల్ కూడా ఉండటం విశేషం. అన్ని భాషలలో ఇదే టైటిల్ ని సినిమాకి కొరటాల శివ కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ టైటిల్ తనదే అంటూ నిర్మాత బండ్ల గణేష్ తెరపైకి వచ్చాడు. దేవరా టైటిల్ ని నేనే రిజిస్టర్ చేయించుకున్నా… నేను మరిచిపోవడంతో ఆ టైటిల్ ని ఇప్పుడు కొట్టేసారు అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవ్వడంతో తర్వాత దానికి కొనసాగింపుగా దేవరా టైటిల్ తీసుకున్న నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే తారక్ కూడా నా దేవర కాబట్టి అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే బండ్ల గణేష్ ఈ టైటిల్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రిజిస్టర్ చేయించాడు. భీమ్లా నాయక్ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ డైలాగ్స్ లో దేవరా అనే పదాన్ని త్రివిక్రమ్ ఉపయోగించాడు. ఇక ఈ టైటిల్ పై త్రివిక్రమ్ తో సంప్రదించిన తర్వాత తారక్ మూవీకి కన్ఫర్మ్ చేసిన్నట్లు సమాచారం.
నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్ ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా ఆయన కూడా నాకు దేవరే ❤️ https://t.co/Ad1wIqIfYB
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023