Bimbisara Director Vassishta : ఇటీవల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బింబిసార. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా బింబిసార నిలిచింది. ఈ చిత్రంలో డైరెక్టర్ వశిష్ట స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపించారు. దీంతో టాలీవుడ్ లో ఈ యంగ్ డైరెక్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
అయితే బింబిసార హిట్ తర్వాత వశిష్ట నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ప్రటించనప్పటికీ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇంతలో ఈ దర్శకుడు అనవసరమైన వివాదంలో చిక్కుకున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.
ఇలాంటి ట్రోలింగ్ వీడియోని వశిష్ట మల్లిడి ట్విట్టర్ లో లైక్ చేసాడని రామ్ చరణ్ అభిమానుల ఆరోపణ. చరణ్ అభిమానులు ఆగ్రహంతో దర్శకుడిపై ఫైర్ అయ్యారు. దీంతో దర్శకుడు అతడి ప్రొఫైల్ను లాక్ చేశాడు. మెగా ఫ్యాన్స్ చిరంజీవికి కూడా ట్యాగ్ చేస్తూ ఇది నిజంగా జరిగితే వశిష్ట ప్రాజెక్ట్ను ఓకే చేయవద్దని కోరుతున్నారు. వశిష్ట వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.