Brahmaji Tweet About Samyuktha Menon : టాలీవుడ్ లో నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, చలాకీతనంతో కామెడీతో కౌంటర్లు వేస్తూ.. అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. స్టేజి మీద అయినా సోషల్ మీడియాలో అయినా సరే ఆయన వేసే కౌంటర్లు మాములుగా ఉండవు. ఆ మధ్య అనసూయ ఆంటీ వివాదానికి కౌంటర్ గా బ్రహ్మాజీ.. నన్ను అంకుల్ అంటే.. పోలీస్ కేసు పెడతా.. అంటూ ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
అది మరువక ముందే ప్రభాస్.. ఆదిపురుష్ టీజర్ లంచ్ లో డైరెక్టర్ ఓం రౌత్ ను.. కమ్ టూ మై రూమ్ అన్న దాన్ని బ్రహ్మాజీ ఇమిటేట్ చేస్తూ సుమ షోలో సుమ.. కమ్ టూ మై రూమ్ అంటూ రచ్చ చేసాడు. ఇక తాజాగా విరూపాక్ష బ్యూటీ సంయుక్తను సరదాగా ఏడిపించాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్తా మీనన్ కథానాయిక.
సినిమా ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉందంటూ హీరోయిన్ సంయుక్తా మీనన్ ట్విట్టర్ వేదికగా చిట్ చాట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిసింది. ట్రైలర్ చాలా బాగుందంటూనే.. ‘‘ట్రైలర్ కంటే మీరు చాలా బాగున్నారు.. ట్రైలర్ అంతా మీరే ఉంటే ఇంకా బాగుండేది’’ అంటూ పొగడ్తలు కురిపించారు నెటిజన్స్.
ఇదిలా కొనసాగుతుండగా బ్రహ్మాజీ ఎంటర్ అయ్యాడు. అభిమానులతో పాటు బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు. ట్రైలర్ నచ్చిందా చెప్పండి. అన్న ప్రశ్నకు .. “చాలా బాగుంది.. ప్లాటినం లెగ్ గారు” అంటూ రిప్లై ఇచ్చారు. అరే ఏంటి బ్రహ్మీ గారు అంటూ సంయుక్త సిగ్గులు మొగ్గలు వేసింది.
ఇక టాలీవుడ్ ఎంట్రీ తోనే పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ , బింబిసార, సార్ ఇలా వరుసగా హిట్లు అందుకోవడంతో.. బ్రహ్మాజీ గోల్డెన్ లెగ్ బదులు ప్లాటినం లెగ్ అనేసాడు. ఇక వీరిద్దరిని చూసిన అభిమానులు అన్న హీరోయిన్ తో పులిహోర కలిపేస్తున్నావా..? మీరు బ్రహ్మాజీకి మాత్రమే రిప్లయ్ ఇస్తారా? మాకు ఇవ్వరా? అంటూ సంయుక్తా మీనన్ని ప్రశ్నించారు నెటిజన్స్.
Trailer nachindha ? Cheppandi !!!! ♥️♥️♥️♥️ #VirupakshaTrailer pic.twitter.com/z5vd8PLM2K
— Samyuktha (@iamsamyuktha_) April 12, 2023