Mahesh Babu : టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు మహేష్. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట కూడా సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ త్రివిక్రమ్ తో SSMB28 లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో మరో మూవీ చేయనున్నాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎండ అంటే పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాసేపు ఎండ లో నిలబడితే ఆయన చర్మం మొత్తం ఎర్రగా మారిపోతుంది.
కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన షూటింగ్ లో సొమ్మసిల్లి క్రింద పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మహేష్ బాబు అప్పటి నుండి ఎండల్లో సినిమాలు చెయ్యడం మానేశాడు. నెక్స్ట్ రాజమౌళితో మూవీ ఉండడంతో సున్నితంగా ఉండే మహేష్ బాబు ఎలా సినిమా చేస్తాడు అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ‘మహర్షి’ సినిమాలో మండుటెండలో మహేష్ బాబు ఒక సన్నివేశం చేయాల్సి వస్తే, అందుకు మహేష్ ఒప్పుకోకపోవడంతో AC సెట్స్ వేసి గేదెలు కూడా అక్కడే సెట్ చేసి ఫైట్ చేయించారట.
ఇది తెలిసిన నెటిజన్స్ మహేష్ ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సీన్ గురించి వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. “మహర్షి’ మూవీలో అల్లరి నరేష్ కాపాడే సీన్ లొనే గేదెలు ఉంటాయి. ఈ సీన్ నైట్ టైం తీశారు. ఎండ ఎక్కడ ఉంది’ అంటూ ప్రశ్నిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అలాగే.. ‘ఎండకు భయపడే వాడైతే ‘ఖలేజ’ మూవీలో ఎడారిలో 40 రోజులు ఎండలో ఎలా నటించాడు. ‘టక్కరిలో ఎండకు గుట్టల మధ్య నటించింది కూడా మహేష్ కదా అంటూ నెటిజన్స్ కి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు ఫ్యాన్స్..