Prabhas Female DieHard Fan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అమ్మాయిల్లో డార్లింగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. బాహుబలి2 తో డార్లింగ్ క్రేజ్ ఖండాంతరాలకు రీచ్ అయ్యింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్.
ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించారు. ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించగా.. టీ సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ కోసం టోక్యో నుంచి సింగపూర్ వచ్చింది ఓ ఫీమేల్ డై హార్డ్ ఫ్యాన్.
ఇండియాలోనే కాకుండా.. జపాన్ లోనూ డార్లింగ్ ప్రభాస్ కు ఎక్కువగానే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఓ అమ్మాయి ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ చూసేందుకు ఏకంగా టోక్యో నుంచి సింగపూర్ వరకు ప్రయాణం చేసిందట. దీంతో ఆమెకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియోలో ఆమె తెలుగు మాట్లాడుతుండడం విశేషం. తాను ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చూసేందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానానికి హద్దులు లేవని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
https://twitter.com/GskMedia_PR/status/1671747583814025217?t=QUyJHaw6nfk7U72IJo497Q&s=19