Prabhas Help to Salaar Staff : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అమ్మాయిల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించిన భారీ చిత్రం ఆదిపురుష్ మేనియా ఇండియా అంతా పాకింది. బుక్ మై షోలో ఆదిపురుష్ హవా కనిపిస్తుంది. ఈ మూవీ రిజల్ట్ నెక్స్ట్ వచ్చే డార్లింగ్ చిత్రాలపై పడనుంది. ఆదిపురుష్ విడుదల అనంతరం కొన్ని నెలల వ్యవధిలోనే సలార్ రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కేజీఎఫ్2 ను మించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ప్రభాస్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ నటిస్తుండగా.. మీనాక్షీ చౌదరి, జగపతిబాబు కీలక పాత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం మైనింగ్ ప్రాంతాల్లోనే జరిగింది. దీంతో సలార్ టీం రాత్రిపగలు శ్రమించారు.
ఇదిలావుండగా డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీకి వర్క్ చేసిన సిబ్బంది విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఆనందాన్నిచ్చింది. అదేంటంటే.. సలార్ కోసం రేయింబవళ్లు శ్రమించిన సిబ్బందికి ప్రభాస్ తాను పర్సనల్ గా ఒక్కొక్కరికి 10 వేల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేశాడట. ఈ మూవీ కోసం వారు పడ్డ కష్టాన్ని గుర్తించి ప్రభాస్ కొంత ఆర్థికసాయం చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మా డార్లింగ్ బంగారం అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్స్.