Rekha Nair controversy : తమిళ నటి రేఖ నాయర్ టీవీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022లో ‘ఇరవిన్ నిహాల్’ తమిళ సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. రచయితగా, నటిగా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రేఖా నాయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే మరోసారి ఆమె వాఖ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ గా మారింది.
ఇటీవల మహిళలు సెక్సీ గా ఉండే దుస్తులను ధరిస్తున్నారు. దీంతో అబ్బాయిలు అలా ప్రవర్తిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడగ్గా.. దీనికి రేఖ నాయర్ తనదైన స్టైల్ లో బోల్డ్ స్పందించింది. “హాట్ హాట్ డ్రెస్ వేసుకుని ఉన్న అమ్మాయిలను ఏ అబ్బాయి అయినా తన హిప్ పై చేయివేస్తే కంప్లైంట్ చేసే బదులు.. ఫీల్ అయి ఎంజాయ్ చేయండి” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.