Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడట. సెప్టెంబర్ 1 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేశారు.
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించిన “నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే” సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకొని వరల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్ని పొంది రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ పాటకు విజయ్ రీల్ చేశాడు. సమంతకు తెలీకుండా విజయ్ ఆ రీల్ చేయడం విశేషం.
నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే అంటూ లిరిక్స్ తగ్గట్టు విజయ్ .. సమంతతో ఆ రీల్ చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ సినిమా పై విజయ్ అండ్ సమంత ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. విజయ్ నటించిన లైగర్, సమంత నటించిన శాకుంతలం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం అవ్వడంతో ఖుషి సినిమాతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చూడాలి ఖుషి రిజల్ట్ ఎలా ఉంటుందో..
https://www.instagram.com/reel/CsIho77Ias5/?igshid=NTc4MTIwNjQ2YQ==