పదేళ్ల క్రితం సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక స్వచ్ఛంద సంస్థ వారు ముష్టి వాళ్ళకి సహాయం చేద్దామని ఒక ప్రణాళిక సిద్ధం చేశారు.
డోనేషన్స్ కలెక్ట్ చేశారు.
రైల్వేస్టేషన్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో
బెగ్గర్స్ ని వెళ్లి కలిశారు.
ఒక పెద్ద స్థలంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు.
వారందరికీ నచ్చజెప్పి అక్కడికి తీసుకుని వచ్చారు.
వారికి మంచి భోజనం బట్టలు పెట్టారు.
వృత్తి వ్యాపారాల్లో శిక్షణ ఇద్దామని అనుకున్నారు.
పది రోజులు తర్వాత బెగ్గర్స్ ఒక్కొక్కరు
ఆశ్రమం వదిలి వెళ్లిపోవడం మొదలుపెట్టారు.
కారణం ఏమిటని తలపట్టుకుని కూర్చున్న నిర్వాహకులకి వారిచ్చిన సమాధానం దిమ్మ తిరిగిపోయింది
- 1. మేము రోజూ మూడు సార్లు మందు తాగుతాం..
అది మీరు ఇవ్వరు..
2. మాకు సిగరెట్లు గంజాయి తాగటం అలవాటు.
మీ దగ్గర అది నిషేధం..
3. మీరు పెట్టె భోజనం మాకు ఊళ్ళో కూడా దొరుకుతుంది.
కానీ రెగ్యులర్ గా సినిమాలు చూసే అలవాటు ఉంది..
4. మీరు పొద్దున్నే లేపుతున్నారు
మేము 9 గంటలు వరకూ లేవలేం..
5. ఈ కారణం మీకు చెప్పకూడదు. చెబితే మాతో పాటు మీరు కూడా అడుక్కుంటారు..
మా సంపాదన రోజుకు వెయ్యి రూపాయలు..
ఆశయం మంచిదే..
ఆచరణకి పరిస్థితులు అడ్డంగా ఉంటాయ్..!!