అడుగులు వేగంగా వేస్తే కాళ్ళు విరిగిపోతాయేమో అన్నంత సుకుమారంగా నడుస్తున్నారు..
గాలి గట్టిగా పీల్చితే గుండె ఆగిపోతుందన్న నాజూకుగా గాలి పీలుస్తున్నారు..
వివాహ మహోత్సవం అంట..!!
పదుల కొలదీ వంటకాలు..
రకరకాల పళ్ల రసాలు..
ఇదేంటి విచిత్రంగా ఉంది ?
తినేవాళ్ళకంటే వడ్డించేవాళ్లే ఎక్కువగా ఉన్నారిక్కడ..??
ఇవన్నీ ఒక్కో స్పూన్ తిన్నా తెల్లారేసరికి
కడుపు పగిలిపోవటం ఖాయం..
అన్ని ఐటమ్స్ ఉన్నాయ్ ఇక్కడ..
కాస్సేపు మొత్తం పరిశీలించాను..
నడుచుకుంటూ నెమ్మదిగా వచ్చిన కొందరు అతి తక్కువగా తింటున్నారు..
ఎంత తక్కువ తింటే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు..
అన్నం తినే యోగం కూడా లేని కొందరు, పుల్కా వేసుకుని పచ్చగడ్డి కూర తింటున్నారు..
వాటర్ బాటిల్ మూత తీసుకోలేక డ్రైవర్ కి మిస్డ్ కాల్ ఇస్తున్నారు..
నాకు అర్ధమైంది.. వీళ్ళు ఎవరూ తినరు..
కాదు కాదు.. తినలేరు..
అయితే ఈ కన్నడ అడవుల్లో నుంచి సేకరించిన లవంగాలు, కన్యాకుమారి నుంచి తెచ్చిన దాల్చిన చెక్క, పాడేరు నుంచి తెచ్చిన లవంగాలు, పాడి రైతులు తాము డబ్బులకోసం ఆశపడి
అమ్మిన స్వచ్ఛమైన పాలు వృధా కావలసిందేనా..??
రాత్రి 12 అయ్యింది.. ఇంతకూ వడ్డించేవాడు తిన్నాడో లేదో..??
అయినా పెళ్లికి వెళ్లి రాక నాకెందుకో ఇవన్నీ..??
అయినా నాగురించి మీకు తెలియంది ఏముంది
తోచింది రాసుకుని వెళుతూనే ఉంటాను..
సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది..!!