AC Power Saving Tips : ఒకపక్క రోహిణి కార్తె వెళ్ళిపోయి మృగశిర కార్తె వచ్చినప్పటికీ కూడా వాతావరణం లో ఎటువంటి మార్పులు లేవు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఇంట్లో వేడి అధికంగా ఉండడం వల్ల చాలామంది ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఈ వేసవిలో ఏసీలను ఎక్కువగా వాడడం వల్ల కరెంట్ బిల్లు కూడా అత్యధిక మోతాదులో వచ్చి మనల్ని బెంబేలెత్తిస్తూ ఉంది.
ఏసీని ఎక్కువ వాడినా కూడా బిల్లు తక్కువ రావడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏసీ ని 16 లేదా 18 డిగ్రీల వద్ద పెట్టి వాడుతుంటారు. అయితే అలా పెట్టడం వల్ల కూలింగ్ బాగా వస్తుందని వాళ్ళు భ్రమపడతారు. వాస్తవానికి శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు కాబట్టి ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచితే సరిపోతుంది. ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఆరు శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతుంది.
ఒకవైపు ఇంట్లో ఏసీ ఆన్ చేసే ఉంటుంది. మిగతా తలుపులు, కిటికీలు తెరిచి పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల బయట గాలి లోపటికి వచ్చేసి ఏసీ యొక్క చల్లదనం మనకు తెలియదు. ఏసీ ఆన్ లో ఉన్నంతసేపు కిటికీలు, తలుపులు మూసివేసి ఉంచాలి. అలాగే ఏసీ ని స్లీప్ మోడ్ లో ఉపయోగిస్తే 36% విద్యుత్తు ఆదా అవుతుంది. మరికొంతమంది ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ కూడా వేసి ఉంచుతారు.
అలా రెండిటిని ఒకేసారి వాడడం వల్ల, ఏసీ గాలి గదిలో ప్రతి మూలకు వ్యాపిస్తుంది. చాలాసేపు గది చల్లగా ఉండడానికి దోహదపడుతుంది. ఏసీ ఉష్ణోగ్రతను తగ్గించి ఉంచితేనే చల్లదనం పెరుగుతుంది. ఈ చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల అధిక కరెంట్ బిల్లు బాధ నుండి విముక్తి పొందవచ్చు.