Baking Soda : బేకింగ్ సోడా ఇది ప్రతి ఒక్కరి కిచెన్ లో మనకు కనిపిస్తూనే ఉంటుంది. దీని రసాయన నామధేయం సోడియం బై కార్బోనేట్. దీనినే మనం సాధారణ భాషలో బేకింగ్ సోడా అని పిలుస్తూ ఉంటాము. చాలామంది వంటలలో బేకింగ్ సోడాను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా బేకరీకి సంబంధించిన పదార్థాలలో బేకింగ్ సోడాను ఎక్కువగా వినియోగిస్తారు. స్వీట్లు, కేకుల తయారీలో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే బేకింగ్ సోడా వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేనినైనా అతిగా వాడితే ప్రమాదమే.. అలాగే బేకింగ్ సోడాను తగిన మోతాదులో వాడి నష్టాలను నుండి తప్పించుకోవచ్చు.. దానివల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియ సంబంధ సమస్యలైనటువంటి అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు బేకింగ్ సోడా చక్కటి ఔషధమని చెప్పవచ్చు. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి తాగితే ఈ సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
పొట్ట ఉబ్బరం కూడా తగ్గుముఖం పడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో బేకింగ్ సోడా కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఈ పౌడర్ ని కలిపి దానికి తగినంత నిమ్మరసాన్ని చేర్చి తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఏదైనా పురుగు కుట్టినట్టు అనిపిస్తే వెంటనే ఆ ప్రాంతంలో బేకింగ్ పౌడర్ ని పేస్టులాగా చేసి కుట్టిన చోట రాయాలి.నిదానంగా మంట,నొప్పి తగ్గుముఖం పడతాయి. అలాగే చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు.
అలాంటివారికి బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగితే కిడ్నీలో ఉన్న రాళ్లు కరుగుతాయి. అంతేకాకుండా పాదాలకు నొప్పులు ,వాపులు కూడా తగ్గుముఖం పడతాయి. స్నానం చేసే నీళ్లలో బేకింగ్ పౌడర్ కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అధిక చెమటతో బాధపడేవారు బేకింగ్ పౌడర్ ను నీళ్లలో కలిపి ఆ మిశ్రమంలో కాటన్ తడిపి చెమట ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అప్లై చేయడం వల్ల దుర్వాసన నుంచి ఉపశమనం పొందుతారు. ఈ పౌడర్ ను చేతులు క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు.