BaldHead: బట్టతల అంటే ఎవరికైనా భయమే. ముఖ్యంగా ఈ బట్టతల విషయంలో పురుషులు బాగా భయపడిపోతుంటారు. ఈ రోజుల్లో బట్టతల రావడానికి వయసుతో సంబంధం లేదు. చాలా చిన్నవారికి కూడా ఈ సమస్య వస్తుంది. అయితే ఈ బట్ట తల సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనం తినే ఆహారం, మన జీవన శైలి, వాతావరణ కాలుష్యం, మద్యం సేవించడం, ధూమపానం చేయడం,
గంటల తరబడి లాప్ టాప్స్ ముందు కూర్చోవడం, దానికి తోడు తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం,ముఖ్యంగా ఇలాంటి అంశాలు బట్టతల రావడానికి బాగా దోహదపడుతుంటాయి. చిన్న వయసులోనే బట్టతల వస్తే మాత్రం, ఇక వారి బాధ వర్ణనాతీతం. అందుకే బట్టతల వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ఈ బట్ట తల రాకుండా నివారించేందుకు ఒక ఆయిల్ మనకు అందుబాటులో ఉంది.
ఈ ఆయిల్ ను మనం సొంతగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వారానికి రెండు సార్లు వాడితే చాలు బట్టతల భయం ఇక అవసరం లేదు. మరి ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి..? ఆయిల్ వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కావలసినవి అలోవెరా ఆకులు మరియు ఉల్లిపాయ. ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలు ను కూడా తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో అర గ్లాసు కొబ్బరి నూనె, అర గ్లాసు బాదం నూనె వేసి వేడి చేసుకున్నాక ,మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లగా అయిన అనంతరం వడగట్టుకుని ఒక బాటిల్ లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ ని రాత్రి నిద్రపోయే గంట ముందు స్కల్ పైన, పది పదిహేను నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. తెల్లవారి ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం తగ్గిపోయి, ఒత్తుగా పెరుగుతుంది. బట్టతల వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆయిల్ తో మరో ఉపయోగం కూడా ఉంది. ఒకవేళ మీకు చుండ్రు సమస్య ఉంటే గనక ఆ సమస్య తొలగిపోయి ,తెల్ల జుట్టు కూడా త్వరగా రాకుండా ఈ ఆయిల్ నివారిస్తుంది.