Banana : అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. మరి ప్రతిరోజు క్రమం తప్పకుండా అరటిపండు తినడం మంచిదేనా..? అరటిపండు అధికంగా తీసుకోవడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయా..? ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు వల్ల రెండు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఒకటి ఆరోగ్యం, మరొకటి అందం. అరటిపండ్లలో ఎక్కువగా విటమిన్ B6 పొటాషియం, విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ అధికంగా ఉండి, కేలరీలు, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది అరటిపండు తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు.
ఏ పదార్థమైన మితంగా తింటే మంచిదే కానీ అతిగా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో అరటిపండు కూడా చేరుతుంది. ముఖ్యంగా అరటిపండును జుట్టు, చర్మ రక్షణకు ఉపయోగిస్తూ ఉంటారు. వీటిల్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ జుట్టును, చర్మాన్ని హైడ్రెడ్ గా ఉంచడమే కాకుండా మయిచ్ఛారైజర్ గా కూడా పనిచేస్తుంది. జుట్టు రాలిపోవడాన్నీ అరటిపండు నియంత్రిస్తుంది. ప్రతిరోజు అరటిపండు తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.
ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడమే కాకుండా శరీర అవయవాలు బాడీ ఎనర్జిటిక్ గా ఉంటాయి అరటిపండు బరువు నియంత్రించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. మూడ్ డిజార్డర్, యాంగ్జైటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు అరటిపండ్లు తినడం వల్ల వాటి నుంచి తప్పించుకోవచ్చు. అరటి పండ్లు ఎముకల ఆరోగ్యాన్ని బలంగా ఉంచడానికి ఎంతో దోహదపడతాయి. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటిపండును ప్రతిరోజు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.