Benefits of Water : మనిషి యొక్క జీవన మనుగడకు నీరు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. శరీరంలో నీటి శాతం తక్కువ అయినట్లయితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీరు డిహైడ్రేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. అలాంటి నీటిని శరీరానికి అనుగుణంగా ఎలాంటి మోతాదులో తీసుకోవాలి ఏ, ఏ సమయాలలో నీటిని తాగాలి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. గోరువెచ్చని నీటిని తాగితే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆక్టివేట్ కూడా అవుతాయి. ఉదయాన్నే నీళ్లు తీసుకోవడం వల్ల మెటపాలిజం ఇంప్రూవ్ అవుతుంది. వ్యాయామం చేసిన తర్వాత ఒక గ్లాసు నీరు తాగడం వల్ల గుండె కొట్టుకునే స్థాయి సమతుల్యంగా ఉంటుంది.
భోజనం చేయడానికి ఒక అరగంట ముందు నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. అలా నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా మెరుగ్గా పనిచేయడమే కాక అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ లాంటివి తగ్గుముఖం పడతాయి. అలాగే భోజనం తక్కువ తినడానికి నీరు దోహదపడుతుంది. స్నానం చేయడానికి ముందు కూడా ఒక గ్లాసు వాటర్ ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
నీరసంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు గ్లాసుల నీరు తాగాలి. నీళ్లలో ఎనర్జీటిక్ పవర్ ఉంటుంది. రాత్రి నిద్రపోయే సమయంలో కూడా నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. దీని కారణంగా మీ బాడీ రాత్రి సమయాల్లో హైడ్రేటెడ్ కాకుండా ఉంటుంది. నీటిని సరైన సమయంలో తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు సైతం తొలగిపోతాయి.