Cauliflower : కాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాక, దానివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే అనారోగ్యం సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా సరే అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి. మరి కాలీఫ్లవర్ ని ఎలా తీసుకోవాలి. దానివల్ల లాభమా..? నష్టమా..? ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ తినడం వల్ల లాభాలు : కాలీఫ్లవర్ ఉబకాయం నుండి మనల్ని రక్షిస్తుంది. గుండెను పదిలంగా ఉంచుతుంది. ఎముకలను దృడంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించడంలో దోహదపడుతుంది.
కాలీఫ్లవర్ తినడం వల్ల నష్టాలు : ఏ ఆహార పదార్థాలైన అతిగా తింటే ప్రమాదమే.. అలాగే కాలీఫ్లవర్ ను అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ ఫ్లవర్ లో రాఫీనోస్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్. దీనివల్ల మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇది విచ్చినం కాదు. అలా జీర్ణం కాకపోవడం వల్ల మన పొట్టలో బ్యాక్టీరియా పులియబెట్టడం మొదలవుతుంది.
దీంతో పొట్టలో గ్యాస్, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే కాలీఫ్లవర్ తిన్నప్పుడు మన పొట్టలో నుండి ఒక విధమైన వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. త్రేన్పు రావడంతో ఆ వాసనను మనం గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే.. కాలీప్లవర్ లో గ్లూకోసినోలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి పొట్టలో విచ్చినం అయినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరచడమే దీనికి కారణం.
కాలీప్లవర్ ను తినడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య ఎక్కువవుతుంది. క్యాలీప్లవర్ ను ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది క్రమంగా మూత్రపిండాల్లో రాళ్లకు దారి తీయవచ్చు. కాలీఫ్లవర్ ను ఎంత తక్కువ తింటే అంత మంచిది. అలాగే అన్నం సరిగా జీర్ణం కాని వారు కాలీఫ్లవర్ ను అస్సలు తినకూడదు. దీనివల్ల వారు ఇంకా సమస్యతో ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాలీఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నీటిలో వేసి ఉడికించడం కంటే ఆవిరిపైన దీనిని వండుకొని తినడం ఉత్తమం.