Child Care Tips : చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కోసారి మనకు తెలియకుండా ఏవో చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. చిన్న పిల్లలు వారికి తెలియకుండా చిన్న,చిన్న గోళీలు, పిన్నిసులు, చిన్న చిన్న బొమ్మలను మింగేస్తుంటారు. ఇవి చిన్న సైజులో ఉంటే జీర్ణ వ్యవస్థలో ఎఫెక్ట్ కాకుండా మోషన్ ద్వారా బయటికి వచ్చేస్తాయి.
ఒకవేళ వాటి పరిమాణం పెద్దగా ఉంటే మాత్రం పిల్లలకు చాలా ప్రమాదం సంభవిస్తుంది. అయితే చిన్న పిల్లలకు దూరంగా కొన్ని వస్తువులను ఉంచాలి. వాటిలో ముఖ్యంగా చిన్న బటన్ బ్యాటరీలు. బటన్ బ్యాటరీ లు ఎక్కువగా పిల్లలు ఆడుకునే చిన్న చిన్న టాయ్స్ లలో, రిమోట్ లల్లో, వాచెస్ లల్లో మనం చూస్తుంటాం.
ఒకవేళ ఈ బ్యాటరీలు కనుక చిన్నపిల్లలు మింగితే.. ఇవి మింగిన గంట లేదా రెండు గంటల్లో అవి కడుపులో కరిగిపోయి, చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇది వెంటనే కడుపులో నుంచి తీసివేయకపోతే అన్నవాహిక లేదా కడుపుకు చిల్లులు పడి పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
పిల్లలకు ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులను దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ పొరపాటున కనుక ఇవి పిల్లలు మింగినట్టయితే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ఎండోస్కోపీ చేయించడం మంచిది. లేకపోతే పిల్లలకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.