Childrens Health Tips : వర్షాకాలం మొదలైంది. సీజనల్ జ్వరాలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటిభారిన పడుతూ ఉంటారు. జ్వరం,ఫంగల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుభ్రత పద్ధతులు వారికి అవగాహన కల్పించాలి. వర్షాకాలంలో పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సీజనల్ వ్యాదుల నుంచి వాళ్లను కాపాడుకోవచ్చు.
■ పిల్లల కోసం ఆరోగ్యం కోసం చిట్కాలు..
★ నీళ్ల ద్వారా ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్లను తాగించాలి.
★దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
★వర్షాకాలంలో బూట్లు, బట్టలు తడిసిపోతూ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఆరు బయటనే ఆరబెట్టాలి.
★ పిల్లలు భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు కడుగుతున్నారా లేదా గమనించాలి.
★పిల్లలను బయట ఆటలు ఆడకుండా నియంత్రించాలి. ఇంట్లో ఇండోర్ గేమ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా చూసుకోవాలి. దాని ద్వారా వారికి శారీరక శ్రమ కూడా కలుగుతుంది.
★పిల్లలు చిరుతిళ్ళను జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ వాటిని పిల్లలకు చాలా దూరంగా ఉంచాలి. అలాంటి ఫుడ్ కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు.
★పిల్లలు స్నానం చేసిన వెంటనే టాల్కం పౌడర్ రాసుకునే లాగా చూడాలి.
★ఆహారంలో ఎక్కువగా మసాలా దినుసులు ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా తులసి, దాల్చిన చెక్క, నిమ్మ, అల్లం లాంటి మసాలాలు ఉంటే మంచిది. ఈ మసాలా దినుసులు జ్వరాన్ని నియంత్రించడంలో ఉష్ణోగ్రతను తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తాయి.
★పిల్లలు బయటనుంచి రాగానే వారి పాదాలను వేడి నీటితో శుభ్రపరుచుకునేలాగా వారికి అలవాటు చేయాలి.