Cinnamon : దాల్చిన చెక్క ఒక సుగంధద్రవ్యం.. సహజంగానే అందరూ వంటలలో దాల్చిన చెక్కను వాడుతూ ఉంటారు. చాలామంది వంటలలో మసాలా దినుసులను వాడుతూ ఉంటారు. ఈ మసాలా దినుసులలో ముఖ్యమైనది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను బరువు తగ్గడానికి, మధుమేహం అదుపులో ఉండడానికి, అలాగే కొవ్వు కరగడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
ఈ చెక్కను మరిగించిన నీళ్లను తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సరిగా సాగుతుంది అని చాలామంది దీనిని వాడుతారు. కానీ వీటన్నింటినీ అదిగమిస్తూ దాల్చిన చెక్కను ఇప్పుడు అతి ముఖ్యమైన దినుసుగా చూస్తున్నారు. ఎందుకంటే.. దాల్చిన చెక్కకు క్యాన్సర్ ను అదుపు చేసే గుణాలు ఉన్నాయని వెళ్లడైంది.ఇప్పుడు ఈ దాల్చిన చెక్క క్యాన్సర్ ను మాయం చేస్తుంది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.. కానీ ఇది వాస్తవం. దాల్చినచెక్కతో తాజాగా ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer) కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని (Hyderabad) జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) (NIN) అధ్యయనంలో ఇది నిరూపితమైంది. దాల్చిన చెక్క ప్రొటెస్ట్ క్యాన్సర్ ను మాయం చేస్తుంది.
అలాగే తగ్గుతున్న ఎముకల క్షీణతను కూడా బలంగా తయారు చేస్తుంది అని వైద్య నిపుణులు వెల్లడించారు. దాల్చినచెక్క లో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దాల్చినచెక్క కారణంగా ఎముకల క్షీణత కూడా తగ్గిందని పేర్కొంది. ఈ అధ్యయన యొక్క ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ క్యాన్సర్ ప్రివెన్షన్ రిసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి.