Corn : వర్షాకాలం వచ్చిందంటే మొక్కజొన్న పొత్తుల సీజన్ మొదలవుతుంది. ఒకవైపు వర్షం పడుతుంటే మరోవైపు మొక్కజొన్న పొత్తులు తింటుంటే ఆ రుచే వేరు. ప్రతి ఒక్కరు ఆ రుచిని ఆశీర్వదిస్తూ ఉంటారు. మొక్కజొన్న పొత్తులలో ఎక్కువగా విటమిన్లు ఉంటాయి. మొక్కజొన్న పొత్తులు లభ్యమైనప్పుడు తినడం వల్ల ఆరోగ్యం సంరక్షించబడుతుందని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
మొక్కజొన్న పొత్తులలో ఎక్కువగా ఆసిడ్, విటమిన్ ఇ, బి వన్ బి సిక్స్ పోలిక్ యాసిడ్ నియాసిస్టెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇది పీచు పదార్థం కావడం వల్ల జీర్ణప్రక్రియ సాఫీగా సాగుతుంది. వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తినడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ల భారీ నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
చాలామంది మొక్కజొన్నను ఆవిరిలో కూడా ఉడికించి తింటూ ఉంటారు. అలా తినడం కూడా మంచిదే. మొక్కజొన్న ద్వారా చాలా విటమిన్లు శరీరానికి అందుతాయి. మొక్కజొన్నలో ఎక్కువగా మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్ వంటివి ఉంటాయి. కాబట్టి ఇవి తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. అలాగే దీనిలో ఉండే లినోలె యాసిడ్ చర్మమంటలను ర్యాష్లను తగ్గిస్తుంది.
వర్షాకాలంలో జుట్టు అధికంగా రాలిపోతూ ఉంటుంది.గరుకుగా తయారవుతుంది. మొక్కజొన్న పొత్తులు తినడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. జుట్టు రాలె సమస్య నుంచి బయటపడవచ్చు. మొక్కజొన్నలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని కాంతవంతంగా ఉంచుతాయి. అలాగే మధుమేహంతో బాధపడే వారికి మొక్కజొన్న మేలు చేస్తుంది. ప్రతిరోజు మొక్కజొన్నను ఏదో ఒక రూపంలో తీసుకుంటే శరీరానికి, ఆరోగ్యానికి రెంటికి మంచిది.