Crying : జీవితంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఏడవడాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. అలా ఏడుస్తూ ఉండే వారిని దురదృష్టవంతులుగా పరిగణించి, వారిని ఒక రకంగా చూస్తూ ఉంటారు. కానీ ఏడుపు వల్ల కలిగే ఉపయోగాల గురించి చాలామందికి తెలియదు. ఏడవడం ఒక అదృష్టమని చాలామందికి తెలియదు.
చాలామంది వారికి ఏదైనా బాధ కలిగితే, దానిని ఎవరితో పంచుకోకుండా వారి లోపల దాచుకొని ఏడుపును దిగమింగుతూ ఉంటారు. అలా చేయడం చాలా ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. ఏడుపును బలవంతంగా ఆపడం వల్ల ప్రమాదంలో పడతారని సైంటిఫిక్ గా కూడా నిరూపితమైందని అలాంటివారు రోగాల బారిన కూడా పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఏడవడం వల్ల శరీరంలోని కండరాలు ఉత్తేజితమై రక్తప్రసరణ సాఫీగా సాగుతుందంట. అలా అని ఒకేసారి ఎక్కువ సమయం ఏడవడం కూడా ప్రమాదమే అలా చేస్తే నీరసం వస్తుంది. ఎడ్వడం వల్ల ఒత్తిడికి గురయ్యేవారు ఉపశమనాన్ని పొందుతారు. ఉద్వేగంతో ఏడ్చినప్పుడు వచ్చే ఒక్కచుక్క కన్నీరైనా ఎంతో శక్తివంతమైందని పరిశోధనలో తేలింది.
బోరున ఏడ్చే సమయంలో వారిలోని అంతర్గతంగా ఉన్న బాధ, మరో తత్వం బయటికి వస్తుంది. అయితే ఈ ఏడ్వడం కోసం ప్రత్యేకంగా కాలేజీని నిర్మించారు. ఏడ్వడం కోసం కాలేజా..అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజమే ఏడవడం కోసం ఫీజులు కట్టి మరి ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. ఈ కాలేజ్ జపాన్ లో ఉంది. జపాన్ ప్రజలు చాలా సుకుమారంగా ఉంటారంట.
వారు ఏడవాలి అంటే అసలు ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఈ కాలేజీని నిర్మించారు. ఏడవడం వల్ల ఉండే ఆరోగ్య ప్రయోజనాలను ఈ కాలేజీలో వివరిస్తారు. కానీ ఇక్కడ హాస్యాస్పదం ఏమిటంటే వారిని ఏడిపించడం కోసం అక్కడి యాజమాన్యం నానా తంటాలు పడాల్సి వస్తుందంట.