Curd – Salt : భోజనంలో పెరుగు లేనిది చాలామంది భోజనాన్ని పూర్తి చేయరు. చాలామందికి భోజనం చివర్లో పెరుగు ఖచ్చితంగా ఉండాల్సిందే పెరుగు రోజువారి ఆహార పదార్థాలలో భాగమైపోయింది. అలాంటి పెరుగుతో కొంతమంది ఫ్రూట్స్ ను కూడా కలిపి తీసుకుంటూ ఉంటారు. మరి దాని వల్ల ప్రయోజనాలు, అప్రయోజనాలు ఏమిటనేది తెలుసుకుందాం. ఇలా పెరుగుతో కాంబినేషన్లో తినడం చాలా ప్రమాదం. అనే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పెరుగుతో ఉప్పును ఖచ్చితంగా అందరు వాడుతారు.
అది కూడా ఆరోగ్యానికి ప్రమాదమనే వాడు చెబుతున్నారు. ఉప్పు లేకుండా పెరుగు అన్నం తినడం అసలు సాధ్యం కాని పని చాలామందికి. కానీ ఆరోగ్యం పాడవుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా.. పెరుగులో ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్లు ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అది ఒక మంచి ఆహార పోషకమని చెప్పవచ్చు. అయితే రాత్రి పూట చాలామంది పెరుగును తింటూ ఉంటారు. అలా తినకూడదనే వైద్యులు చెప్తున్నారు.
కొద్ది అన్నంలో కొద్ది మొత్తం పెరుగు అయితే పర్వాలేదు కానీ, అధిక మొత్తంలో పెరుగును తింటే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, కొవ్వు పెరిగిపోవడం, కఫామ్ సమస్యలు వస్తాయి. పెరుగు ఎసిటిక్ కాబట్టి పెరుగుతోపాటు ఉప్పు కలుపుకొని తింటే కఫ సమస్యలు అధికమవడమె కాక, కొవ్వు కూడా అధికంగా పెరిగిపోతుంది.
శ్వాసనాల ద్వారా ఉత్పత్తి అయ్యే శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మార్కెట్లో దొరికిన పెరుగును అయితే ఇంకా అసలే తినకూడదు. చాలామంది పెరుగును ఫ్రీజర్ లో పెట్టి తింటూ ఉంటారు. దానివల్ల ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. పెరుగుతోపాటు ఇంకా కొంచెం రుచి కావాలనుకుంటే మాత్రం దానికి తోడు బెల్లాన్ని చేర్చి తినడం చాలా ఉత్తమం.