Dengue Day Theme 2023 : ఈరోజుల్లో కాలంతో సంబంధం లేకుండా దోమల బెడద మరి ఎక్కువగా ఉంది. దోమలు ఎంత ప్రమాదమో మనకు తెలుసు. కొత్త వ్యాధులను సృష్టించగలవు. డెంగ్యూకు కారణం ఈ దోమనే అని మనకు తెలిసిన విషయమే.ముఖ్యంగా వైరల్ వ్యాధులు, డెంగ్యూ వంటి సమస్యలు ఈ దోమల వల్లనే వస్తాయి. ఇలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.
ఒకవేళ డెంగ్యూ వ్యాధి వస్తే శరీరంలోని ప్లేట్లెట్స్ క్రమంగా తగ్గుతాయి. దానివల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవాలి. కాబట్టి ఈ దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. ప్రతి సంవత్సరం డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వాలు డెంగ్యూ పై అవగాహన కల్పిస్తూన్నాయి. చికిత్సపై కూడా అవగాహన కల్పించే దిశగా ప్రతి సంవత్సరం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుతున్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?: ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మే16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఈ డెంగ్యూ ఏడిస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. డెంగ్యూ శరీరంలోనికి వ్యాపిస్తే రెండు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది. డెంగ్యూ వల్లా జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా వేగంగా రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గి ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. అలాంటి సమయంలో విశ్రాంతి చాలా అవసరం.
ఈ డెంగ్యూ కి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం “డెంగ్యూ ని మనమందరం కలిసి తరిమికొడదాం” థీమ్ తో అందరూ ముందుకు వెళ్తున్నారు.