Department of Health : వాతావరణం లోని అధిక వేడితో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోవడం దానివల్ల ప్రజలు వడదెబ్బ తగిలి లేక ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడడం పెరిగిపోతోంది. మరి అలా ఇబ్బంది పడకుండా శరీరాన్ని నిత్యం హైడ్రెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు.
శరీరాన్ని హైడ్రెడ్ గా ఉంచుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కాఫీ, టీ వంటి వాటిని దూరంగా ఉంచాలి. వాటిని ఎక్కువగా సేవించరాదు. కార్బోనేటెడ్ శీతల పానియలు ఎక్కువగా తీసుకోకూడదని ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిస్తుంది. అలాగే అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని, పాడైపోయిన ఆహారాన్ని అసలు ముట్టవద్దని మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరిస్తుంది.
క్రమం తప్పకుండా నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరం నిర్జలీకరణకు గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ సమస్య తీవ్రమైతే మాత్రం దానివల్ల విపరీతమైన అలసట, అనారోగ్యాలు, బలహీనత కారణమని గమనించాలని వైద్యశాఖ హెచ్చరిస్తుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తున్నా మరి కొన్ని జాగ్రత్తలు..
ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వంట చేయకూడదు. వంట చేసే ప్రదేశంలో వెంటిలేట్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇంట్లొ తలుపులు ,కిటికీలు ఎప్పుడు కూడా తెరిచి ఉంచి బయటి గాలి లోపలీకి వచ్చేలాగా చూసుకోవాలి. ఆల్కహాల్, కాఫీ ,టీ కార్బోనేటెడ్ వంటి శీతల పానీయాలను తీసుకోకపోవడం ఉత్తమం. వాటి వల్ల ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోయే అవకాశం ఉంది.
ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక మాంసకృతులు కలిగిన ఆహారాన్ని దూరం పెట్టాలి. వాటికి బదులుగా నిమ్మరసం, పండ్లు, కొబ్బరి నీళ్లు, చల్లటి పానీయాలు తీసుకోవడం మంచిది. అలాగే మితిమీరిన భోజనం కూడా చేయకూడదు. దానివల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. అతిగా భోజనం చేస్తే జీర్ణం కావడానికి చాలా కష్టం అవుతుంది. మీరు ఇబ్బంది పడవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మిత భోజనం మంచిది.