Dragon Fruit Health Benefits : పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు మనం తీసుకునే ఆహారంలో పండ్లను తీసుకుంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే పండ్లల్లో అతి ముఖ్యమైనది డ్రాగన్ ఫ్రూట్ కూడా. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ డ్రాగన్ ఫ్రూట్ బయటికి గులాబి రంగులో ఉండి, లోపల మాత్రం తెలుపు, ఎరుపు రంగులతో నల్లటి గింజలను కలిగి ఉంటుంది.
శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకు ఐదు రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే ప్రీబయోటిక్స్, ఫైబర్ మన శరీర జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మలబద్దంకం సమస్యను నుండి మనల్ని కాపాడుతుంది. అలాగే ఈ ఫ్రూట్ తినడం వల్ల మన శరీరంలో గట్ మైక్రోబ్స్ అభివృద్ధి జరుగుతుంది.
హెల్త్ కామ్ నివేదిక ప్రకారం ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ప్రీబయోటిక్, బ్యాక్టీరియా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణక్రియ పరిస్థితులను మన శరీరంలో నివారించడంలో సహాయపడుతుందని వెల్లడించింది. అలాగే మధుమేహంతో బాధపడేవారు, బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండేవారు ఈ ఫ్రూట్ తినడం వల్ల ఆ వ్యాధులను నియంత్రణలో ఉంచవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలేక్ యాసిడ్, పీచు, రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది. మీరు డయాబెటిస్ నీ నివారించాలనుకుంటే మాత్రం ఈ పండ్లను ఖచ్చితంగా తినవలసిందే.
యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా దొరికే ఈ డ్రాగన్ ఫ్రూట్ మన గుండెను కూడా పదిల పరుస్తుంది. ఇందులో ఉండే పాలి ఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ పండులో ఉండే నలుపు రంగు విత్తనాలలో పుష్కలంగా మనకు లభించి మన గుండెను ఆరోగ్యంగా, ప్రభావంతంగా ఉంచడమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ ను తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మీ శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే తీవ్రమైన వ్యాధులను నివారించడంలో కూడా ఈ పండు ముందంజలో ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు. అలసట, బలహీనత, మైకంతో బాధపడేవారు ఈ పండును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చును. ఐరన్ శాతం శరీరంలో తక్కువగా ఉన్నవారు ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే వెంటనే ఐరన్ ని పొందవచ్చును.