Eyes : “సర్వేంద్రియానం నయనం ప్రధానం” అంటారు. మన శరీరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి కళ్ళు. కళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే అది మన రోజువారి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. కొంతమందిలో కంటి చూపు మెరుగ్గా ఉన్నప్పటికీ, మరి కొంతమంది కంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలలో ముఖ్యంగా కళ్ళు మసకగా కనపడడం, కంటి
మధ్య భాగంలో నల్లగా ఏర్పడడం జరుగుతుంది. దీన్ని మాక్యులర్ డిజెనరేషన్ అని పిలుస్తారు. మ్యాకులా కనుగుడ్డు వెనుక భాగంలో ఉంటుంది. కన్ను మధ్య భాగం లో నల్లగా ఇంకా మసకగా కనబడడానికి కారణం ఈ మ్యాకులనే. దీనికి రక్తప్రసరణ సక్రమంగా అందకపోవడమే. ఈ మ్యాకులకు సరఫరా చేసే రక్తకణాలు
కుచించుకుపోవడం వల్ల రక్తనాళాలు దెబ్బ తినడం జరుగుతుంది. ఈ పరిస్థితి వల్ల సరిగ్గా ఉండవలసిన గీతలు వంకరగా కనిపిస్తూ ఉంటాయి. దీని ప్రభావం వల్ల కాంతి తక్కువగా ఉన్నప్పుడు మనకు సరిగా కనిపించదు. అలాగే ముఖాలను కూడా గుర్తుపట్టలేనంతగా కళ్ళు మారిపోతాయి. రంగులను కూడా
కనిపెట్టలేకపోతూ ఉంటారు. అక్షరాలు మసగ్గా కనిపించడం లాంటిది సంభవిస్తాయి. మరి ఈ మాక్యులర్ డీజెనరేషన్ సమస్య తలెత్తడానికి చాలా కారణాలే ఉన్నాయి. రక్తపోటు మరియు డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. అలాగే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ను అధికంగా తీసుకోవడం కారణంగా
రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ ఏర్పడి మాక్యులాకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని కారణంగా మాక్యులర్ డి జెనరేషన్ అనే ఈ సమస్య ఏర్పడుతుంది. అధిక బరువు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. కొంతమందిలో జన్యుపరమైన సమస్యలు, ఈ సమస్యకు కారణం అవుతాయి.
అలాగే ధూమపాణం కూడా మరొక కారణం. మాక్యులర్ డీజెనరేషన్ సమస్యను మనం చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. విటమిన్ సి ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రా ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చును. రోజుకు 400 నుండి 500 మీల్లి గ్రాముల విటమిన్ సీని తీసుకోవాలి. ప్రతిరోజు రెండు జామకాయలు
తినడం, భోజనం చేసిన తర్వాత ఎండబెట్టిన ఉసిరిముక్కలను తినడం మంచిది. విటమిన్ సీ నీ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.