Fasting : భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది దేవుళ్లకు ఉపవాసం ఉంటూ ఉంటారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఉపవాసం ఉండడం మంచిదే వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా సాగుతుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు.
ముఖ్యంగా బరువు సమస్యతో బాధపడేవారు ఉపవాసం ఉండడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఉపవాసం వల్ల మన ఒంట్లో ఉండే కొవ్వు సులభంగా కరిగే అవకాశాలు ఉన్నాయి. ఉపవాసం చేసేవారికి గుండె సంబంధిత సమస్యలు కూడా ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే శరీరాన్ని బ్యాలెన్సింగ్ చేయడంలో ఉపవాసం ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగని వారానికి రెండు, మూడు రోజులు ఖాళీ కడుపుని ఉంచడం మంచిది కాదు.. సరైన సమయాన్ని ఉపవాసానికి ఎంచుకోనీ జాగ్రత్తగా పాటించాలి. ఉపవాసం ఉండడం వల్ల మనం హైపర్ టెన్షన్ ని తగ్గించుకోవచ్చు. అలాగే ఒత్తిడికి కూడా దూరమవుతాము. ఉపవాసం చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దాని కారణంగా జీర్ణ సంబంధిత వ్యాధులు దరి చేరవు.
ఉపవాసం చేయడం వల్ల శరీరంలో నుండి వ్యర్దాలు శుభ్ర పడతాయి. అలాగే శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే వచ్చే అనారోగ్య అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. అలా చేయడం వల్ల శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్ గా ఉండి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.