Fiber Benefits : మనిషి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పోషకాల్లో విటమిన్లు, మినరల్స్ తో పాటు అత్యంత ముఖ్యమైనది ఫైబర్. సంపూర్ణ ఆరోగ్యానికి శరీరంలో ఫైబర్ ఖచ్చితంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. మన శరీరంలో ఫైబర్ శాతం సమృద్ధిగా ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. మనిషి యొక్క ఆరోగ్యము అతడి శరీరపు మెటబోలిజంపై ఆధారపడి ఉంటుంది.
శరీరంలో మెటబోలిజం సక్రమంగా ఉన్నంతవరకు అనారోగ్య పరిస్థితి తలెత్తదు. మెటబొలిజం సమృద్ధిగా శరీరంలో ఉండాలంటే ఫైబరు చాలా అవసరం. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. మనిషి శరీరాన్ని ప్రమాదంలో పడేసేది కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. కొలెస్ట్రాల్ శాతం తగ్గాలి అంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే డయాబెటిస్ సమస్య కూడా మనిషిని తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది.
ఈ డయాబెటిస్ తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సరైన చికిత్స కూడా లేకపోవడం గమనార్హం. డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే ఆహార పదార్థాలలో ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి. ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. అలాగే ఆహారంలో ఫైబర్ తగిన మోతాదులో తీసుకున్నట్లయితే జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.
జీర్ణవ్యవస్థ బాగుంటే మన శరీరంలోకి ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలు వచ్చి చేరవు. పండ్లు, తృణధాన్యాలు, కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వాటిని తీసుకోవడం ఉత్తమం. ఫైబర్ ఎక్కువగా ఉంటే మలబద్ధకం సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు. బరువు సమస్య అన్నింటికంటే ప్రధానమైనది.
బరువు నియంత్రణలో ఉండాలంటే రోజువారి ఆహారంలో ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయితే కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఫైబరు ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. కీరదోస, జామ పండ్లు, ఆపిల్, బొప్పాయి, బత్తాయి పండ్లలో మనకు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. రోజువారి ఆహారంలో ఇవి ఉండేలాగా చూసుకుంటే ఫైబర్ సమస్య నుంచి మనం బయటపడవచ్చు.