Fig Fruit : అంజీర పండ్లు మనం తెలుసు. వీటిని అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. వీటిని ఎండబెట్టుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యా ప్రయోజనాలు పొందవచ్చు. అంజీర పండ్లు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయో తెలుసుకుందాం..చాలామంది అంజీర పండ్లను ఎండబెట్టి లేకపోతే తాజా పండ్లను తింటూ ఉంటారు.
అంజీర లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఎలా తీసుకున్నా కూడా మన శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా దీనిలో ఉండే విటమిన్ b6 ,విటమిన్ E, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కె, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం మన శరీరానికి పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ సహజ చక్కర గుణాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి ఈ పండు తింటే ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
జీర్ణ క్రియ : ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ పేగు కదలికలను చాలా అవసరం. ఈ పండు తినడం వల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది : అంజీర పండు ఒక శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేస్తుంది. గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.
ఎముకలను బలోపేతం చేస్తుంది :
మన శరీరంలో ఉన్న ఎముకలను అస్థిపంజరాన్ని అంజీర పండు బలంగా ఉంచుతుంది. ఈ పండులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఖనిజాలు ఇవి ఎముకలకు ఎక్కువ సాంద్రతను ఇవ్వడంలో తోడ్పడతాయి. అలాగే వ్యాధితో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.