Food to Eat in Winter : అందరం చలికాలంలోకి అడుగు పెట్టాము. ముఖ్యంగా చలికాలంలో మనలో రోగ నిరోదక శక్తి తక్కువగా ఉంటుంది. దానివల్ల తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ బారిన ఎక్కువ పడుతుంటారు. కాబట్టి తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. చలికాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వింటర్ సీజన్ మొత్తంలో మనం తీసుకున్న ఆహారం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సీజన్ లో చాలామంది బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే, ఈ వింటర్ లో రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
★ మెంతికూర : మెంతికూరలో ఫైబర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలి నియంత్రించి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో ఎంతో సహాయం చేస్తాయి. శీతాకాలంలో తప్పకుండా మెంతుకూర తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
★ కొత్తిమీర : కొత్తిమీరతో తయారుచేసిన పచ్చడిని ఉదయాన్నే అల్పాహారం తీసుకునే టైం లో తింటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలోనీ చక్కర పరిమాణాలను కూడా నియంత్రిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నీ కూడా తగ్గిస్తాయి.
★ ఆకు కూరలు : చలికాలంలో ఆకుకూరలు మనకు విరివిగా లభిస్తాయి. ముఖ్యంగా వాటిల్లో పాలకూర. ఆకుకూరల్లో ఉండే గుణాలు రక్తంలోని చక్కెరను తగ్గించి ఎముకల పటిష్టాన్ని పెంచడంతోపాటు క్యాన్సర్ నీ నివారించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. రక్తపోటు సమస్యతో బాధపడేవారు చలికాలంలో ఆకుకూరలు తీసుకోవడం మంచిది.