Gray Pumpkin : బూడిద గుమ్మడికాయ ఇది తెలియని వారంటూ ఉండరు. దీనిని ఎక్కువగా పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దిష్టి తీయడానికి కూడా బూడిద గుమ్మడికాయను వాడుతూ ఉంటారు. దీన్ని ఆహార పదార్ధంగా కూడా తీసుకుంటారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడే బూడిద గుమ్మడికాయ మన శరీరానికి ఎలా వినియోగించుకోవచ్చు, దానివల్ల ప్రయోజనాలు ఏమిటి..
బూడిద గుమ్మడికాయను స్వీట్లు తయారీలో వాడుతూ ఉంటారు. ఇంకా నమ్మలేని విషయం ఏమిటంటే బూడిద గుమ్మడికాయ ఒక ఔషధం లాగా కూడా మనకు పనిచేస్తుంది. ముఖ్యంగా వాటిలోని ఆకులు, గింజలు వివిధ రకాల చికిత్సలలో వాడబడుతున్నాయి. ఈ కాయలో 96% నీరు ఉంటుంది. దీంట్లో ఫైబర్ కూడా అధికమే. అలాగే విటమిన్ సి, విటమిన్ బి2, మెగ్నీషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, లు అధికంగా ఉన్నాయి. టైప్ టు డయాబెటిస్ మొదలు బోలెడు ఆరోగ్య సమస్యలను బూడిద గుమ్మడికాయ తినడం వల్ల తగ్గించుకోవచ్చు.
బూడిద గుమ్మడికాయ కడుపులో ఉన్న పుండ్లను, పేగు సమస్యలకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని అభివృద్ధి చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీంట్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు బూడిద గుమ్మడికాయను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. బయటకు విసర్జింప చేయడంలో బూడిద గుమ్మడికాయ సహాయం చేస్తుంది.
బూడిద గుమ్మడికాయను తరచుగా తినడం వల్ల జుట్టు సంబంధిత ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే మూత్రపిండాలను శుద్ధి చేయడంలో బూడిద గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. దిష్టి తీయడానికి మాత్రమే ఇన్ని రోజులు మనం ఉపయోగించిన బూడిద గుమ్మడికాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయంటే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా తినడం ఆరంభించండీ..