Health Benefits of Honey : తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ప్రకృతిలో ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా స్వచ్ఛంగా ఉండేది తేనె ఒక్కటే. అలాంటి తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తేనెలో కూడా తెలుపు రంగు తేనె ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉన్న తేనెను వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఈ తెలుపు రంగు తేనెను ముడి తేనా అని కూడా పిలుస్తారు.
తెలుపు రంగు తేనెను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది. ఎలాంటి జబ్బులను దూరం చేసుకోవచ్చు, ఇప్పుడు తెలుసుకుందాం. తెలుపు రంగు తేనెలో ముఖ్యంగా భాస్వరం, జింక్, మెగ్నీషియం లాంటి విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ తెలుపు రంగు తేనెను” హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్” అని కూడా పిలుస్తారు.
ఎందుకంటే సహజసిద్ధమైన ఆంటీ ఆక్సిడెంట్లు ఈ తేనెలో నిక్షిప్తమై ఉన్నాయి. తెలుపు రంగు తేనె తీసుకోవడం వల్ల గుండె జబ్బులు ,క్యాన్సర్ లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు మన దరిచేరకుండా చూసుకోవచ్చు. తెలుపు రంగు తేనెను ప్రతిరోజు ఉదయం పరిగడుపున తాగడం వల్ల నోటిలో ఏర్పడే నోటి పుండ్లు తొలగిపోయి,నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
దగ్గు సమస్య వేధిస్తూ ఉంటే గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను, మరియు నిమ్మ రసాన్ని కలుపుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. దానితోపాటు ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం కూడా వృద్ధి చెందుతుంది. రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది.