Health Tips : శరీరానికి నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.. అయితే ఆ నీరును ఏ సమయంలో ఎప్పుడు తీసుకోవాలి అనేది మాత్రం చాలా మంది అజాగ్రత్త చేస్తూ ఉంటారు. శరీరానికి తగిన మోతాదులో నీరు లభించినట్లయితే కడుపు సంబంధిత వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలని వారు సూచిస్తారు. అలాగే ఉదయం బ్రష్ చేయడానికి ముందే చాలామంది పాచి నోటితో నీళ్లను తాగేస్తుంటారు. అలా తాగడం మంచిదేనా..?
బ్రష్ చేయడానికి అంటే ముందు నీళ్లను తాగడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి మీరు ఆరోగ్యంగా ఉండటమే కాక బద్ధకం, మొటిమలు, కడుపు జబ్బులు, అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరమవుతాయని వారు తెలియజేస్తున్నారు. మనం నిద్రకి ఉపక్రమించిన తర్వాత 7 నుండి 8 గంటల మధ్య శరీరానికి కావలసిన నీరు అందదు. అప్పుడు శరీరం హైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఉదయం లేవగానే నీళ్ళను తాగితే మంచిది.
ఉదయాన్నే నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటివి దరి చేరవు. అలాగే మీ శరీరానికి కావలసిన రోగానిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పాచి నోటితో నీళ్లు తాగడం వల్ల హై బీపీ, మధుమేహం వంటివి దూరం అవుతాయి. అలాగే ఉభకాయంతో బాధపడేవారు ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా తాగడం వల్ల నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులన్నీ క్రీములన్ని క్లీన్ చేయబడతాయి. కొన్ని గంటల తరబడి నోరు పొడిబారడం వల్ల నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదయం లేవగానే పాచి నోటితో నీరు తాగడం ఉత్తమం.