Health Tips : కొందరు సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కొందరు పని ఒత్తిడి వల్ల అలా చేస్తూ ఉంటారు. కానీ అలా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. రాత్రి సమయాల్లో ఆహారం ఆలస్యంగా తీసుకుంటే హీట్ బర్న్, యాసిడ్ రీప్లేక్స్ అయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
దీనివల్ల జీర్ణక్రియకు ఇబ్బందులు ఏర్పడతాయి. రాత్రి తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వదు. వైద్య నిపుణుల సలహాల ప్రకారం ఏడు లోపే ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర సమస్య కూడా ఎదురవుతుంది. ఆహారం తొందరగా జీర్ణం అవ్వక మనం మెలకువగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిద్ర సరిగా లేకపోతే మానసికంగా, శారీరకంగా అలిసిపోయి ఒత్తిడికి గురవుతారు.
పీడకలలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. నిద్రకూ ఆహారానికి మధ్యలో రెండు గంటల వ్యవధి ఖచ్చితంగా ఉండాలి. రాత్రి తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే రాత్రి వేళలో తినేవారికి బ్లడ్ ప్లజర్, గుండె సమస్యలు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువే అని వైద్యులు సూచిస్తున్నారు.