Health Tips : ప్రతిరోజు మనిషి ఎన్నో రకాల ఒత్తిడిలకు గురవుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా సరైన నిద్ర లేకపోతే ఒత్తిడితో ఎక్కువగా బాధపడతారు. నిద్రలేమి వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చి చేరుతాయి. మరి సుఖమైన నిద్ర పొందాలంటే ఎలాంటి ఆహార అలవాట్లను అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.
ఆరోగ్యవంతమైన నిద్ర మాత్రమే మనిషి ఆరోగ్యానికి మంచిది. నిద్ర పట్టడం కోసం నిద్రమాత్రలు వేసుకోవడం మంచిది కాదు. సువాసన గల నూనెతో పాదాలను మసాజ్ చేసుకుంటే మీకు సుఖవంతమైన నిద్ర పడుతుంది. మంచి నిద్ర కోసం చాక్లెట్ ,కాఫీ, టీ ,ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉన్న ఉత్పత్తులను దూరం పెట్టాలి. వాటి వల్ల నిద్రలేమి కలుగుతుంది.
ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేయడమే కాక నిద్రలేమికి కారణమయ్యే సెరోటోనిన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. అలాగే ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉన్న పదార్థాలను నిద్రపోయే ముందు తీసుకోకపోవడమే ఉత్తమం. ఇవి కూడా సెరోటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. రాత్రంతా మేల్కొని ఉండేలా చేస్తాయి.
నిద్రలేమితో బాధపడేవారు బఠానీలు, బ్రోకలీ, బీన్స్ వంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు రాత్రిపూట తినకపోవడం మంచిది. చక్కెర శాతం ఎక్కువగా ఉంటే అది నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రపోయే ముందు పాల ఉత్పత్తులను ఫాస్ట్ ఫుడ్ లాంటి కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకపోవడం మంచిది.
కొంతమంది పడుకునే ముందు సిగరెట్ తాగుతారు ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ ఆహారపు అలవాట్లను దరి చేరకుండా చూసుకుంటే సుఖవంతమైన నిద్ర మీ సొంతమవుతుంది. నిద్రలేమి సమస్యల నుంచి మీరు బయటపడతారు.