Health with Oats : ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటిలో వారు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ఓట్స్ వాడుతున్నారు. అయితే ఓట్స్ అతిగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కోసం ఓట్స్ ని అందరూ ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ ఓట్స్ తినడం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అవే ఓట్స్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఓట్స్ ని కూరగాయలు లేదా పండ్లతో కలిపి తినడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకానీ చక్కర, చాక్లెట్స్, చిప్స్ వంటి వాటితో అస్సలు తినకూడదు.
స్వీటు తో కలిపి తినడం వల్ల ఓట్స్ లో ఉండే పోషకాలు తగ్గిపోవడమే కాక, మీ శరీరంలో చక్కెర అధిక క్యాలరీలు ఉన్న కొవ్వును మరింత పెరిగేలా చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రతిరోజు అల్పాహారంగా ఓట్స్ తినడం సమంజసం కాదు. వారానికి రెండు సార్లు తినడం ఉత్తమం. మిగతా రోజులలో పోషకాలు అందించే ఆహారాలను తినడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఓట్స్ లో ఫైబర్ శాతం అధికంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియ పైన ప్రభావం చూపుతుంది. ఎక్కువగా ఓట్స్ తీసుకోవడం వల్ల కడుపులో మంట ప్రారంభమై ఇబ్బంది కలుగుతుంది. అప్పటికే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో బాధపడేవారు ఓట్స్ ను అధికంగా తీసుకుంటే అనారోగ్య బారిన పడతారు. అంతేకాకుండా ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల మీ శరీరం చురుకుదనాన్ని కోల్పోయి, మీరు ఉత్సాహంగా ఉండలేరు. కాబట్టి ఏ ఆహారమైనా అతిగా తినడం ప్రమాదమే.