Healthy Breakfast : చాలామంది ఉదయం నిద్ర లేవగానే చాలా అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. రాత్రి పడుకునే ముందు ఉన్నంత హుషారు ఉదయం లేవగానే ఉండదు. ఆరోగ్యం కూడా సహకరించినట్టుగా అనిపిస్తుంది. అలసటకు కొన్ని వ్యాధుల లక్షణాలు కూడా కారణం కావచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది నిద్ర లేకపోవడం వల్ల కూడా సంభవించవచ్చు. లేక రాత్రి సరిగా తినకపోవడం వల్ల కూడా వస్తుంది.
కానీ అలసట నుండి ఏ ఆహారం ద్వారా సరైన శక్తిని పొందవచ్చు. పోషకాలు సరిగా అందకపోతే అలసటకు కారణం కావచ్చు. అలాగే రోజంతా ఎనర్జిటిక్ గా, అలసటకు దూరం కావాలంటే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే అయితే ఆ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలను తెలుసుకుందాం..
★ అరటిపండ్లు : అరటిపండులో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, పొటాషియం ఉంటాయి. అలాగే సుక్రోజ్, ప్రక్టోస్, గ్లూకోజ్ వంటి సహజ చెక్కరలను ఈ పండు కలిగి ఉంటుంది. ఈ పండు మన శరీరానికీ కావలసిన శక్తిని పెంచి కార్బోహైడ్రేట్లను కూడా పుష్కలంగా మనకు అందిస్తుంది. రోజు అరటి పండును తినడం వల్ల అలసట నుండి దూరం కావచ్చు.
★ గుడ్లు : గుడ్లు చాలా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఇనుము, కోలిన్, కొవ్వులు విటమిన్ బి12, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. రోజు ఉదయాన్నే గుడ్డు తినడం వల్ల మీరు ఆ రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
★ ఓట్ మీల్ : ఓట్ మీల్ ఒక కప్పులో 7.5 గ్రాముల ఫైబర్ మనకు దొరుకుతుంది. అలాగే కేలరీలు దీంట్లో తక్కువగా ఉంటాయి. తగినన్ని పోషకాలు అందించి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇది రోజువారి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం మంచిది.
★ ఖర్జూరాలు : ఖర్జూరాలలో పాన్రోతేనిక్ ఆమ్లం, ఫోలేట్, నియాసిన్ వంటి బి విటమిన్లు మనకు లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఆహారం శక్తిగా మార్చే ప్రక్రియ వేగవంతంగా మన బాడీలో జరుగుతుంది. రోజుకు రెండు లేదా మూడు ఖర్జూరాలు తినడం మీ శక్తిని పెంచుతుంది. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం చాలా మంచిది.