Heart Attacks : ఇప్పుడున్న జీవన విధానంలో మనిషికి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందో ఊహించలేము. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువగా గుండెపోటు గురించి వింటున్నాము. చాలామంది మన కళ్ళముందే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అలాంటి ఈ గుండెపోటు ఎక్కువగా సోమవారమే వస్తుందని తాజాగా ఒక సర్వేలో వెళ్లడైంది. మాంచెస్టర్ లో బ్రిటీష్ కార్డియోవాస్కులర్ కాన్ఫరెన్స్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెళ్లడించారు.
చాలామందిలో గుండెపోటు మిగతా రోజులతో పోలిస్తే పనిదినాలు మొదలయ్యే మొదటి రోజుల్లోనే అనగా సోమవారం రోజు ఎక్కువగా వస్తున్నట్లు నమోదు అయిందని సర్వేలో తేలింది. ఐర్లాండ్ లో బెల్ ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్కు చెందిన కొందరు పరిశోధకులు, డాక్టర్లు ఈ పరిశోధన నిర్వహించారు. వీరిలో 7,112 రిపబ్లిక్ ఐర్లాండ్, 3,416 మంది డాక్టర్ ఐలాండ్ కు చెందినవారు.
వీరు 2013 నుంచి 2018 సంవత్సరం మధ్యలో ఆసుపత్రిలో చేరిన దాదాపు 10,528 మంది మీద ఈ పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో భయటపడిన విషయాలు ఏమిటంటే.. వీరిలో చాలామంది STEMI అంటే.. ST-సెగ్మెంట్ ఎలివేషన్ మయో కార్డియల్ ఇన్పార్క్షన్ అనే సమస్యతోనే ఆసుపత్రిలో చేరినవారు. అంటే దాని అర్థం కరోనరీ ధమని పూర్తిగా కూరుకుపోవడం వల్ల గుండెపోటు రావడం.
ఈ లక్షణాలు ఉన్న వారిలో గుండెపోటు త్వరగా వస్తుందని వారు వెల్లడించారు. ముఖ్యంగా సోమవారం రోజున ఈ సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుందని, సోమవారం ఎక్కువగా ఈ సమస్య ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలు చెప్పలేకపోవడం ఇక్కడ గమనార్హం. కానీ ఇంతకుముందు కొన్ని సర్వేల ప్రకారం దానికి ముఖ్య కారణం సర్కేడియన్ రిధమ్ అని వారు అభిప్రాయపడుతున్నారు.
అంటే జీవగడియారంలో మార్పులు రావడం వల్ల అనగా నిద్ర, తిండి విషయంలో జరిగే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది అంట. బ్రిటిష్ హాట్ ఫౌండేషన్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలేష్ సమానీ యూకే లో దాదాపు ప్రతియేట 30వేల మంది STEMI గుండెపోటు వల్ల ఆసుపత్రిలో చేరడమే కాక గుండె దెబ్బతిని ప్రమాదానికి గురవుతున్నారనీ, యుకె లో ప్రతి ఐదు
నిమిషాలకు ఒకరు ఆసుపత్రిలో చేరుతున్నారని వెల్లడించారు. గుండెపోటుకు, సోమవారానికి STEMI కారణం ఉందని ఈ పరిశోధనలో తేలిందని ఆయన వెల్లడించారు. దీనికి చాలా కారణాలు వెళ్లడైనప్పటికీ పరిశోధనల ప్రకారం సర్కాడియన్ రిధమ్ లో మార్పులు అంటే నిద్ర, తినే సమయం, పనుల్లో మార్పు రావడం వల్లనే ఈ గుండెపోటు వస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు.