Honey : ఈ భూమి మీద సహజంగా ప్రకృతి పరంగా లభించి, పాడవకుండా ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేది తేనె మాత్రమే. తేనె రుచికి ఎంత మధురంగా ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తేనెలో ఉండే చాలా రకాల పోషకాలు, ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తాయి. తేనే ఒక ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణ కూడా ఉపయోగపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి తేనె వల్ల ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం..
తేనెలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మన శరీరంలో రోగానిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు ఒక స్పూను తేనె తీసుకోవడం వల్ల గుండె చాలా పదిలంగా ఉంటుంది. అలాగే శరీరంలో పుండ్లు ఏర్పడితే తేనే వాటిని తగ్గుముఖం పట్టిస్తుంది. తేనెలో ఉండే యాక్టివ్ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గు, కఫం, జలుబు వంటి సమస్యలు రాకుండా సహాయపడతాయి. అంతేకాకుండా తేనె మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు తెనే ను తీసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇలా ఎన్నో ప్రయోజనాలను మనకు చేకూర్చే తేనే కొన్ని అప్రయోజనాలను కూడా తీసుకువస్తుంది. మరి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.. చాలామంది మనలో ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ అలా తాగడం చాలా ప్రమాదం అని నిపుణులు తెలియజేస్తున్నారు. తేనెను గోరువెచ్చని నీటితో కలిపితే అది విషయంగా మారుతుందని ఆయుర్వేదం నిపుణులు వెల్లడిస్తున్నారు.
అలా గోరు వెచ్చని నీటితో తేనెను కలుపుకొని తాగినట్లయితే అది స్లో పాయిజన్ గా బాడీకి ఎక్కుతుందని అలాగే అధిక వేడి నీటిలో తేనెను కలిపినట్లయితే అది మన శరీరంలో కఫాన్ని ఇంకా పెంచే ప్రమాదానికి దారితీస్తుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా తేనెను బాగా వేడిగా ఉన్న నీటిలో అసలు కలపకూడదు. వంటలో వాడకూడదు అలా చేస్తే కనుక ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తేనె వల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ తరచుగా తేనెను అధికంగా తీసుకునే వారు కూడా ఈ జాబితాలో ఉంటారు. తేనెను అధికంగా తీసుకుంటే గురక సమస్య వస్తుంది. ఆస్తమా పెరుగుతుంది. అధిక చెమట పడుతూ, తల తిరగడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి రోజుకు రెండు స్పూన్ల తేనె కంటే ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.