How to Eat Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మార్కెట్ లో కూడా ఈ పండు విరివిగా దొరుకుతుంది. అయితే ఈ పండు చాలా ఖరీదైనది. కానీ దీనితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మెండు, డ్రాగన్ ఫ్రూట్ ని ఎలా తీసుకోవాలి.. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
డ్రాగన్ ఫ్రూట్ లో మన శరీరానికి కావాల్సిన మాంసకృతులు, విటమిన్ సి, సోడియం, పిండి పదార్థాలు, విటమిన్ ఏ, నియాసిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం, జింక్, ఫోస్ఫరస్, బెటా లైన్స్, ఒమేగా త్రీ, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి అందుతాయి. శరీరానికి ఇవన్నీ అందడం వల్ల బరువు సమస్య దూరమవుతుంది.
అలాగే గర్భధారణ సమయంలో మహిళలకు రక్తహీనత సమస్య దూరం చేస్తుంది. శిశు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేయడంతో పాటు గర్భిణీలకు నీరసం రాకుండా ఈ పండు చూస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. కీళ్లల్లో ఎముకలు రాపిడి జరగకుండా ఉండేందుకు మృదులాస్తి ఆరోగ్యాన్ని ఈ ఫ్రూట్ కాపాడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుంది.
వాపును తగ్గించడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా ఈ పండు అమోఘంగా పనిచేస్తుంది. మధుమేహం రాకుండా చూస్తుంది. క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఎదగడంలో సహాయపడుతుంది. చెడు కొవ్వును నియంత్రించడంలో డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా పని చేస్తోంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడే డ్రాగన్ ఫ్రూట్ ని తొక్కతో మాత్రం అసలు తినకూడదు. అలా తింటే అజీర్తి సమస్యలు వస్తాయి.