Increase Hemoglobin Food : మానవ శరీరానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హిమోగ్లోబిన్ ద్వారా మన శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. హిమోగ్లోబిన్ కూడా ఒక రకమైన ప్రోటీన్.
శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే దాని వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. రక్తహీనత సమస్య వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హిమోగ్లోబిన్ శాతం తగ్గకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం.
★ దానిమ్మ : దానిమ్మలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్ తో పాటు పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన శరీర రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది రోజు ఉదయాన్నే దానిమ్మ గింజలు తినడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది.
★ బచ్చలికూర : విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లు బచ్చలకూరలో సమృద్ధిగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో మనం తీసుకున్నట్లయితే చాలా రకాల వ్యాధుల నుండి బయటపడతాము. హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
★ బీట్‌రూట్ : బీట్ రూట్ లో మనకు ఎక్కువగా ఐరన్ లు, ఫోలెట్ లభిస్తాయి. దీన్ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ పెంచడంలో బీట్రూట్ ముఖ్యపాత్ర వహిస్తుంది.
★ యాపిల్స్ : ప్రతిరోజు ఒక యాపిల్ తింటే చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని హాస్పిటల్ కి వెళ్లే అవసరమే ఉండదని వైద్యులు సూచిస్తూ ఉంటారు ఆపిల్ తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది రక్త హీనత నుంచి బయటపడవచ్చు.
★ గుడ్లు : గుడ్లలో ప్రోటీన్ల పరిమాణం అధికంగా ఉంటుంది. విటమిన్ బి12 కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు రోజు తమ ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే మంచిది.