International Tea Day : ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం. ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే “టీ” కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదయం లేవగానే చాలామంది “టీ” తోటే తమ రోజును ప్రారంభిస్తారు. మనల్ని రోజు మొత్తం ఎంతో ఉల్లాసంగా మార్చే ఈ “టీ” కి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ప్రతి సంవత్సరం మే 21వ తేదీన ఈ “అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని” జరుపుకుంటారు.
ఇలా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 21 2019 న నిర్ణయించింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తాయి. “టీ” నీ ఉత్పత్తి చేయడం, వినియోగానికి అవసరమైన కార్యకలాపాలను అమలు చేయడం, సమిష్టి చర్యలు తీసుకోవడం మొదలైనవి ఈరోజు యొక్క ప్రధాన లక్ష్యం.
ఈ “టీ” ఎక్కడ పుట్టింది. అసలు దీని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్య భారతదేశంలో గల ఉత్తర మయన్మార్ లో నైరుతి చైనాలో ఉద్భవించిందని చరిత్ర చెబుతుంది. అయితే ఖచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ ఈ “టీ” 5000 సంవత్సరాల క్రితం నుంచే చైనాలో వాడుకలో ఉన్నట్టుగా ఆధారాలు కూడా లభించాయి.
భారతదేశంతో పాటు ఇండోనేషియా, వియత్నం, శ్రీలంక, నేపాల్, మలేషియా, బంగ్లాదేశ్ ,కెన్యాసా మలావి, టాంజానియా వంటి ఉత్పత్తి దేశాల్లో 2005 నుంచి ఈ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు, సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్లను ప్రదర్శన చేస్తూ.. ఈ రోజున సమావేశ పరుస్తారు. టీ దినోత్సవం ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం..
గ్రామీణ అభివృద్ధి పై, స్థిరమైన జీవనోపాదిపై “టీ” ప్రాముఖ్యత గురించి అవగాహన కార్యక్రమాలు ఈ రోజు నిర్వహిస్తారు. “అంతర్జాతీయ టీ దినోత్సవం” అనేది అనేక కార్మికుల, పెంపకం దారుల తేయాకు వ్యాపారం పై ప్రభావం లాంటి అంశాలకు వివరిస్తుంది. మహిళల సాధికారతకు కూడా దోహదం చేస్తుంది.