Jaggery Water : బెల్లం ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి వంట గదిలో ఇది మనకు కనిపిస్తూనే ఉంటుంది. చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎన్నో రకాల తీపి పదార్థాలలో, వంటకాలలో బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది చక్కర స్థానంలో బెల్లాన్ని వంటకాలలో వాడుతూ ఉంటారు. మనకు ఏదో ఒక రూపంలో రోజు లభించే ఈ బెల్లం ద్వారా శరీరానికి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం.
బెల్లంలో చాలా రకాల ఖనిజాలు, విటమిన్లు దాగి ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలు ఉండగా, బీకాంప్లెక్స్, సీ, బీటు12, లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే వేడి నీటిలో బెల్లాన్ని కలుపుకొని తాగితే ఆరోగ్యానికి గొప్ యాంటీడోట్లా పనిచేస్తుందని నీపుణులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా ఈ బెల్లంలో శరీరానికి కావాల్సిన వేడిని ఉత్పత్తి చేసే గుణం ఉంది. అలాగే బెల్లం తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలను కూడా దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడేవారు బెల్లం వాడడం వల్ల దానిలో ఉండే పోషకాలు ఈ సమస్యల నుండి మనల్ని కాపాడతాయి.
బెల్లం నీళ్లు తాగడం వల్ల మన శరీరంలోని విషం బయటికి విసర్జింపబడుతుంది. అలాగే దీంట్లో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తుంది. ఆహార పైపులు, శ్వాస కోస వ్యవస్థ, ఊపిరితిత్తులు, కడుపు, ప్రేగులను కూడా ఈ బెల్లం శుభ్రపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం లో బెల్లం ప్రధాన పాత్ర వహిస్తుంది.
బెల్లంలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడతాయి. మన శరీరాన్ని రిలాక్స్ చేసి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. బెల్లం నీళ్లు ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు కరుగుతుంది. బెల్లంలో ఉండే పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్, మినరల్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.