Lungs : చాలా మంది ఈ రోజుల్లో చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దాంట్లో మన శరీరంలో ఉండే లంగ్స్ కూడా ఒక కారణం కావచ్చు. మరి లంగ్స్ ఏవైనా అనారోగ్యాన్ని గురైనప్పుడు ఎటువంటి వ్యాధులు వ్యాపిస్తాయో కూడా మనకు అవగాహన ఉండాలి. లంగ్స్ అనారోగ్యానికి గురైతే ఆస్థమా, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
అయితే ఎక్కువగా ఈ సమస్యలు వర్షాకాలం చలికాలంలో వచ్చి బాధపెడుతూ ఉంటాయి. ఈ సమస్య తలెత్తడానికి ఊపిరితిత్తులలో హిస్టమిన్స్ అనే వాటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఉత్పత్తి అయితే ఊపిరితిత్తుల్లో చికాకు, ఇబ్బంది కలుగుతాయి. హిస్టామిన్స్ ఉత్పత్తి అవడం వల్ల కూడా శ్లేష్మాలు ఉత్పత్తి అయి ఊపిరితిత్తులకు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. దాని కారణంగా ఆస్తమా తగుముఖం పట్టకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
న్యూమోనియా, ఆస్తమాతో బాధపడేవారు మందులు వాడడమే కాకుండా వామాకును కూడా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వామాకులు ఎక్కువగా థైమాల్, కార్వకాల్ అనే రసాయనాలు కలిగిఉంటాయి. ఇవి ఊపిరితిత్తులల్లో హిస్టమిన్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేయడంలో చాలా పనిచేస్తాయి.
వామాకును మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. వామాకును కూరల్లో వాడుకోవడం మంచిది. ఈ వామకును కూరలలో పచ్చడి రూపకంగా కూడా వాడవచ్చు. దీనివల్ల ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి. ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆస్తమా ,న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారికి వామాకు మంచి మార్గం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఈ హిస్టమిన్స్ ఎంత తక్కువగా ఉత్పత్తి అయితే ఊపిరితిత్తుల్లో ఇబ్బంది అంత తక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే శ్లేష్మాలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. సమస్య కూడా త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఈ విధంగా వామాకు ఆస్థమా ఇంకా న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేస్తున్నారు.