Male Baldness : స్త్రీ, పురుషులు ఇద్దరిలో పురుషులు ఎక్కువ శాతం బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఇది. 20, 30 సంవత్సరాలు దాటిన వారిలో కూడా జుట్టు పలుచబడిపోయి బట్టతల రావడం అనేది సహజంగా జరిగిపోతుంది. మరీ బట్టతల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోని నిజమెంతో తెలుసుకుందాం..
2016లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, బట్టతల రావడం అనేది క్యాన్సర్ కు సంకేతం అనే శాస్త్రీయ ఆధారం ఉందని చెప్పవచ్చు. ఎలాగంటే ఈ అధ్యయనం ప్రకారం చిన్న వయసులో మగవారికి బట్టతల వస్తే పురుషులు తర్వాత కాలంలో ప్రోటేస్ట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు వెల్లడించారు. మొత్తం ఈ పరిశోధనలో 20,000 మంది పాల్గొనగా వారి నుండి డేటాను విశ్లేషించడం ద్వారా ఈ వివరణ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు.
అయితే బట్టతలకి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఏకైక కారకం కాకపోయినప్పటికీ 2017లో బ్రిటీష్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించబడిన మరో అధ్యయనంలో మగవారి బట్టతలకు ఆ తరువాత కాలంలో మెలనోమా వంటి చర్మ క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కూడా కనుగొన్నారు. జన్యూశాస్త్రం ప్రకారం బట్టతల క్యాన్సర్ ప్రమాదానికి కుటుంబ నేపథ్యం కూడా కారణం అవుతుంది.
బంధువులకు ఇటువంటి క్యాన్సర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్లకు కూడా ఈ ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. పురుషుల్లో బట్టతల రావడం అనేది క్యాన్సర్ కి దారితీసే అవకాశం స్పష్టంగా లేకపోయినాప్పటికీ, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు అకాల బట్టతల సమస్య ఏర్పడితే మాత్రం వెంటనే ఒకసారి వైద్యుణ్ని సంప్రదించడం ఉత్తమం.