Non Veg – B12 : మాంసాహారంలో బి -12 ఎక్కువగా లభిస్తుందని చాలామంది మాంసాహారాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బి-12 లోపించకూడదని మాంసాహారాన్ని తీసుకుంటారు. శాఖాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో బి -12 లోపం అధికంగా మనకు కనిపిస్తుంది. కానీ తాజాగా చేసినటువంటి అధ్యయనాల్లో మాంసాహారంలో కూడా విటమిన్ బి 12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉందని తేలింది.
తమిళనాడుకి చెందిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’ సైంటిస్టులు చేసినటువంటి అధ్యయనంలో… నాన్ వెజ్ తింటున్న వండే పద్ధతిలో, వంట కోసం వాడే పాత్రలు, అలాగే కాయగూరలు ఎక్కువగా తినడం, డ్రింకింగ్, స్మోకింగ్, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వెజిటేరియన్స్ లో విటమిన్ బి12 లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయని వెళ్లడైంది.
సైంటిస్టులు ఈ అధ్యయనాన్ని 200 మందిపై చేశారు. దాంట్లో 20 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఉన్నారు. వారి యొక్క ఆహారపు అలవాట్లను తెలుసుకొని ఒక రిపోర్ట్ సైంటిస్టులు తయారు చేసుకొని ఆ రిపోర్ట్ ప్రకారం బీ12 లోపం ఉన్నవారిలో శాఖాహారులు, మాంసాహారులకు మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించలేదని, ముఖ్యంగా ప్యాకెట్ పాలు తాగుతున్నటువంటి వారిలో, వేయించిన పదార్థాలు తీసుకునేవారిలో, డ్రింకింగ్, స్మోకింగ్, కెఫినేటెడ్ డ్రింక్స్ వంటివి అలవాటు ఉన్న వారిలో బిపి, డయాబెటిస్ వ్యాధులు ఉన్నవారిలో ఈ
లోపం ఎక్కువగా కనిపించిందని, ఒక వెజిటేరియన్లలోనే ఈ లోపం ఉంది అనడం సరికాదని, నాన్ వెజ్ తింటే ఈ లోపం నుంచి బయటపడవచ్చు అనేది ఖచ్చితంగా చెప్పలేమని సైంటిస్టులు వెల్లడించారు. బీ12 అనేది బీ కాంప్లెక్స్ విటమిన్స్‌లో ముఖ్యమైన విటమిన్. ఈ విటమిన్ మెదడు నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరాన్ని అనేక వ్యాధుల భారీ నుండి రక్షించి కీలకంగా పనిచేస్తుంది. ఒకవేళ శరీరంలో ఈ విటమిన్ యొక్క లోపం వస్తే తిమ్మిర్లు పట్టడం, చర్మం పాలిపోవడం, గుండెదడగా అనిపించడం, వత్తిడి వంటివి లక్షణాలుగా కనిపిస్తాయి.
చర్మవ్యాధులు, మానసిక సమస్యలు, డెమోన్షియ, డయాబెటిస్ వంటి వ్యాధులకు కూడా ఈ విటమిన్ లోపం కావచ్చు. ఇది రాకుండా ముందు జాగ్రత్తగా పాలు, రెడ్ మీట్, చేపలు, పీతలు, గుడ్లు, సోయాబీన్స్, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటివి తప్పనిసరిగా మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే డ్రింకింగ్, స్మోకింగ్ వంటివి కూడా మానుకోవాలి.