Non Veg In Monsoon : నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నాన్ వెజ్ ఉందంటే ఇంకో రెండు ముద్దుల అన్నాన్ని ఎక్కువగానే తినేస్తూ ఉంటారు. అత్యధికంగా నాన్ వెజ్ ని తింటూ ఉంటారు. వర్షాకాలంలో నాన్ వెజ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా.. తెలుసుకుందాం..
చేపలు : చేపలు వర్షాకాలంలో తినడం వల్ల సమస్యే.. ఎందుకంటే వర్షాకాలంలో చేపలు సంతాన ఉత్పత్తిని చేస్తుంటాయి. ఇది వాటి శరీర మార్పు దశ. ఈ కాలంలో అనేక రకాల బ్యాక్టీరియా అలాగే వాటి శరీరానికి అంటూకుంటుంది. అలాంటి చేపలను మనం తినడం వల్ల అది మనకు వ్యాపించే అవకాశం ఉంది. ఒకవేళ చేపలు తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చేపను కొనే ముందు ఒకసారి నొక్కి చూస్తే మెత్తగా ఉందొ, గట్టిగా ఉందో అనేది తెలుస్తుంది. అలాగే మొప్పల రంగును కూడా గమనించాలి.
గుడ్లు : గుడ్డులో బ్యాక్టీరియా వారి వ్యాధికారక క్రిములు వర్షాకాలంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది గుడ్డులో ఉండే తేమ వల్ల వీటి పెరుగుదల ఉంటుంది. సాల్మొనెల్లా, ఇ-కోలి బ్యాక్టీరియా వల్లా ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, అజీర్ణం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ గుడ్డు తప్పనిసరిగా తినాల్సి వస్తే, అది తాజాగా ఉందా తెలుసుకోండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో గుడ్డును వేస్తే తాజాది అయితే తేలకుండా నీళ్లలోనే కింది భాగంలో ఉంటుంది. అలాగే గుడ్డు ఉడికించినప్పుడు నీసు వాసన రాకుండా ఉండాలి. గుడ్డు ఉడికే క్రమంలో పగలకుండా ఉంటే అది మంచిది. కాబట్టి వర్షాకాలంలో గుడ్లు ఎక్కువగా తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.
చికెన్,మటన్ : చికెన్, మటన్ కొనుగోలు చేసినప్పుడు తాజా మాంసం అని సమయాలు దొరకకపోవచ్చు. కోడికి మచ్చలు లేదా తెల్లటి గీతలు ఉన్నాయో లేదో పరీక్షించాలి. ఒకవేళ అలా ఉంటే ఆ కోడి వ్యాధితో ఉన్నట్టు లెక్క. దాని ద్వారా మనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మాంసము జిగటగా ఉండకూడదు. తాజా కోడి అయితే దృఢంగా మెరుస్తూ ఉంటుంది.
మాంసాహారం మనం ఖచ్చితంగా తినాలి అనుకుంటే మాత్రం గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు వేసి ముందుగా శుభ్రం చేసుకోని,కొన్ని సుగంధ ద్రవ్యాలతో ఉడికించాలి. మాంసంలో ఉండే బ్యాక్టీరియా వ్యాధికారకాలను చంపడానికి సుగంధ ద్రవ్యాలు ఉపయోగపడతాయి. అయితే వర్షాకాలంలో మాంసాహారాన్ని ఎందుకు తినకూడదు అంటే..
ఈ కాలంలో శరీరము మాంసాహారాన్ని జీర్ణం చేసుకునే శక్తిని తక్కువగా కలిగి ఉంటుంది. మాంసంలో అధికంగా ఉండే ఫైబర్, ప్రోటీన్ వల్ల మాంసం జీర్ణం కావడానికి రెండు రోజులు పడుతుంది అందుకే చికెన్ మటన్ తిన్నా కూడా సరిగా అరగదు దానివల్ల వాంతులు, వికారం వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. వర్షాకాలం వెళ్లేంతవరకు మాంసాహారానికి దూరంగా ఉండడం ఉత్తమం.